ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొడవలూరు మండలంలోని గండవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ, కమిటీ సభ్యులు, స్థానిక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.