నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోవూరు వాసి రఘుబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. అతి వేగంగా వెళుతున్న ఓ బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో రఘుబాబు స్పాట్ లోనే చనిపోగా, మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.