నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరులో జనవరి 3వ తేదీన జరిగిన ఘర్షణలో కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు ఘర్షణకు కారణమైన ఎనిమిది మంది యువకులపై హత్య కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు కావలి డి.ఎస్.పి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.