నెహ్రూ యువ కేంద్ర, కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ మార్కెట్ యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో దివాలి విత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ క్లీనింగ్ మీద మంగళవారం అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా యువజన అధికారి ఏ.మహేంద్ర రెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా స్వచ్ఛభారత్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.