నెల్లూరు నగరంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న టపాసుల దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ విషయమై డిప్యూటీ తహసిల్దార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ.. ఇళ్ల మధ్యలో, పాఠశాల గ్రౌండ్స్ లో నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న టపాసుల దుకాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు.