బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చేజర్ల, చిల్లకూరు, దగదర్తి, కలువాయి తదితర మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు చలి.. మరోవైపు చిరుజల్లులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తుఫాను ప్రభావంతో నష్టాలను ఎదుర్కొన్న అన్నదాతలు ఇప్పుడు మొదలైన వర్షాలతో ఆందోళన చెందుతున్నారు .