రాష్ట్ర మున్సిపల్ శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో బిల్డర్స్ అసోసియేషన్ నేతలు అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నూతన సంస్కరణల గురించి వారికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. నిబంధనలకు అనుగుణంగా 2014-19 లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇచ్చామని తెలిపారు.