ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడితే అడ్డుకుంటామని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య హెచ్చరించారు. నెల్లూరులోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో ఆదివారం జరిగిన వర్గీకరణ పరిరక్షణ జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని భవిష్యత్ ప్రణాళికను తెలియజేశారు. శేఖర్, కొమ్మల కృష్ణయ్య, కె. సుబ్బారావు పాల్గొన్నారు.