సమాజంలో చైతన్యం కలిగించి ప్రజల సమస్యలు పరిశీలించేది పత్రికలు, విలేకరులని నెల్లూరు సమాచార శాఖ డిడి సదారావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవ సందర్భంగా శనివారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నెల్లూరు కొండాయపాలెంలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయ ప్రకాష్, హనూక్ పాల్గొన్నారు.