గత 40 సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైందని, జిల్లా పరిషత్ బడ్జెట్ లో వెనకబడిన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించి ఆదుకోవాలని, శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గళమెత్తారు.వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం నిద్ర వ్యవస్థలో ఉందని, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందన్నారు.