స్వచ్ఛ నెల్లూరు సాకారానికై నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామని, కమిషనర్ సూర్యతేజ తెలిపారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం నెల్లూరు 45 వ డివిజన్ వేదం వారి అగ్రహారం, మిలటరీ కాలనీ, కొండాయపాలెం, రంగానాయకుల పేట, బ్రహ్మనందపురం, గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైను కాలువల పూడికతీత పనులనుపర్యవేక్షించారు.