నెల్లూరు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎంపికలు నెల్లూరులోని ఏ.సి. సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరచిన వారిని నవంబర్ 9, 10వ తేదీల్లో రాయదుర్గంలో జరుగుతున్న రాష్ట్ర పోటీలకు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించాలని తెలిపారు.ఆసక్తి గల వారు ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో తేవాలన్నారు.