నెల్లూరు: సిపిఎం రూరల్ మహాసభలను జయప్రదం చేయాలంటూ ప్రచారం
ఈ నెల 18, 19 తేదీలలో నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సిపిఎం రూరల్ మహాసభలను జయప్రదంవిజయవంతం చేయాలంటూ గురువారం 24వ డివిజన్ సుందరయ్య కాలనీలో, ఇంటింటికి కరపత్రాలు పంచి విరాళాలు సేకరించారు, ఈ సందర్భంగా సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు వీర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం వేయాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.