దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దు
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈనెల మూడవ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రకటించిన దసరా సెలవుల్లో కళాశాలలు నడపకుండా విద్యార్థులకు సెలవులు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశించారు. గురువారం నెల్లూరు ఆర్ ఐ ఓ ఆదురు శ్రీనివాసులతో కలిసి నెల్లూరు నగరంలోని శ్రీ చైతన్య, విశ్వసాయి జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా సందర్శించారు.