
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నెల్లూరులో ఆదివారం జరిగిన బైక్ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. బుజబుజ ప్రాంతంలో నివాసముంటున్న షేక్ ముంతాజ్, తన కుమారుడు తారిక్ తో బైకుపై బయలుదేరింది. మినీ బైపాస్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ మీద వేగంగా దూసుకెళ్లిన బైక్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయింది. ముంతాజ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.