నెల్లూరు రూరల్ పరిధిలోని 30 డివిజన్ నక్క గోపాల్ నగర్ లో బుధవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూ. 40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నెల్లూరు రూరల్ పరిధిలోని 26 డివిజన్ లలో, ఒక్కో డివిజన్ కి కోటి రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయిస్తామన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి మరింత ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, హరిబాబు యాదవ్, కృష్ణ, పాల్గొన్నారు.