సీఎం చంద్రబాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ ఫిర్యాదు చేసిన కేసులో బుధవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు పోలీస్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మొత్తం 2 గంటలసేపు మాజీమంత్రి కాకానికి పోలీసులు 54 ప్రశ్నలు వేసారు.