టూరిస్ట్ బస్సు దగ్ధం: డ్రైవర్ కి తీవ్ర గాయాలు

2902చూసినవారు
మనుబోలు మండల పరిధిలోని వడ్లపూడి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైపోయింది. ఆ బస్సు డ్రైవర్ యజమాని యనమల వాసుకు తీవ్ర గాయాలయ్యాయి. ఖాళీగా ఉన్న టూరిస్ట్ బస్సు నెల్లూరు నుంచి వస్తుండగా వడ్లపూడి సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. అదే సమయంలో బస్సు డోర్స్ లాక్ అయిపోవడంతో వాసు బస్సు అద్దాలు పగలగొట్టి దూకి వేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్