రైతులకు శుభవార్త

63చూసినవారు
రైతులకు శుభవార్త
రైతులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ సీజన్‌లో సగటు సాగు విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు కాగా.. 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేసింది. ఇందులో 5.60 లక్షల టన్నులను ఆర్బీకేల ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్