విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం టూరిజం మేనేజ్మెంట్ విభాగానికి చెందిన మొదటి సెమిస్టర్ విద్యార్థులు శనివారం వెంకటాచలం పరిధిలోని కాకుటూరులో 24 తీర్థంకర జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనకు టూరిజం విభాగాధిపతి డాక్టర్ పి. సుజాత నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. సుజాత మాట్లాడుతూ ఇక్కడి జైన దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైన సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగి ఉందన్నారు.