ఏపీ, కర్ణాటక సీఎంలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి, జనారెడ్డి, కేశవరావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో కేంద్రం నుంచి రావాల్సిన సహకారంపై చర్చించేందుకు.. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు రావాలని, రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు.