AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యులు గురువారం కీలక అంశాలు వెల్లడించారు. గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయినట్లు తెలిపారు. ఆపరేషన్ చేయాలని, కానీ అత్యవసరంగా చేయాల్సిన అవసరంలేదని, సమయం ఉన్నప్పుడు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక నాని గుండె పోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ కూడా ఫోన్ చేసి నానిని పరమర్శించారు. అలాగే నాని కుటుంబ సభ్యులతో కూడా జగన్ మాట్లాడారు.