AP: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ CM జగన్ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఛాతీలో నొప్పి రావడంతో నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు. గుండెలో మూడు వాల్స్ బ్లాక్ అయినట్టు గుర్తించారు.