టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం

84చూసినవారు
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో ఆయన సోదరి మాదాసు సత్యవతి కన్నుమూశారు. సత్యవతి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో వారి కుటుంబం నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని పవన్ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్