రాజ రమేష్ ప్రేమ్ కుమార్ ను పలకరించిన ఎమ్మెల్యే కాకర్ల

55చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పలకరించారు. ఇరిగేషన్ మినిస్టర్ సోమశిల జలాశయ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ లో భాగంగా రాజా రమేష్ ప్రేమ్ కుమార్ ఆదివారం అక్కడికి వచ్చారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయనను ఆత్మీయంగా పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్