సీతారాంపురం: భైరవకోనలో అద్భుత జలపాతం

53చూసినవారు
నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలం- ప్రకాశం జిల్లా సిఎస్ మండలం సరిహద్దులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం భైరవకోనలో అద్భుత జలపాతం ఆవిష్కృతమైంది. ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతం ఉదృతంగా పారుతుంది. అలాగే భైరవకోనలోని త్రిముఖ దుర్గాదేవి ఆలయాన్ని వరద నీరు ముంచెత్తుతోంది. ప్రస్తుతం భైరవకోన సందర్శనకు పర్యాటకులు ఎవరు రావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.

సంబంధిత పోస్ట్