సీతారాంపురం: బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్

79చూసినవారు
సీతారాంపురం: బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్
సీతారాంపురం మండలం పోలంగారి పల్లి పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో ఉదయగిరి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ లక్ష్మణస్వామి అక్కడికి చేరుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పొన్నగంటి రమణయ్య అనే వ్యక్తి వద్ద 9 మద్యం బాటిళ్లు, ముత్తూరు వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి వద్ద 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్