ఉదయగిరి పట్టణంలోని ఆనకట్ట వద్ద ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఉదయగిరి తహసిల్దార్ సుభద్ర, సీఐ వెంకట్రావు, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి లు సోమవారం పరిశీలించారు. దుకాణాల వద్ద అగ్నిమాపక సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని, నిర్వాహకులు అమ్మకాలు అయిపోయే అంతవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు.