ఉదయగిరి: కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు

61చూసినవారు
ఉదయగిరి: కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డి పల్లి గ్రామంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పరమశివుని లింగాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కార్తీకమాసం కావడంతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉండే పలువురు భక్తులు సైతం ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్