రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా వరికుంటపాడు మండలానికి చెందిన ఆవుల అరుణమ్మ ఎన్నికయ్యారు. ఈ మేరకు వరికుంటపాడు మండల టిడిపి కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో శనివారం ఆమెకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు ఆమెను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చండ్ర వెంకయ్య, అడ్వకేట్ రామారావు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.