నెల్లూరు జిల్లా వింజమూరు లో శిరీష సినిమా థియేటర్ పనులను కావలి ఆర్డిఓ వంశీకృష్ణ గురువారం తనిఖీ చేశారు. సీటింగ్ కెపాసిటీ, సీటింగ్ మధ్య దూరం, పార్కింగ్ ఏరియాలను ఆర్డిఓ పరిశీలించారు. నూతన హంగులతో సురేష్ ప్రొడక్షన్ సౌజన్యంతో నిర్మాణం అవుతున్న సినిమా హాల్ ఇది. కాగా ఈ సినిమా హాల్ వింజమూరు పట్టణానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవబోతోంది.