కలిగిరి: వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం
నెల్లూరు జిల్లా కలిగిరిలో బుధవారం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వర్షపు నీటికి తోడు డ్రైనేజీల నీరు కూడా కలవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షపు నీరు వెళ్లడానికి డ్రైనేజీల వ్యవస్థ సరిగా లేదని అందు కారణంగానే వర్షం పడిన ప్రతిసారి నీళ్లు రోడ్ల పైన జలతాండవం చేస్తున్నాయని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.