Sep 02, 2024, 17:09 IST/
చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తలు
Sep 02, 2024, 17:09 IST
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే సీఎం చంద్రబాబు ప్రభుత్వం 6 రెస్క్యూ హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లను ఉపయోగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజలకు తక్షణ సహాయక సేవలు అందించడం అభినందనీయమన్నారు. తెలంగాణలోనూ చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలు సహాయ చర్యలు చేపట్టారని, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని ట్వీట్ చేశారు..