రేపు సుప్రీంకోర్టు జడ్జీగా జాయ్‌మాల్య బాగ్చీ ప్రమాణస్వీకారం

76చూసినవారు
రేపు సుప్రీంకోర్టు జడ్జీగా జాయ్‌మాల్య బాగ్చీ ప్రమాణస్వీకారం
కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఇరత జడ్జీల సమక్షంలో సోమవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బాగ్చీ బాధ్యతల స్వీకరణతో.. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కి చేరుకోనుంది. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండవచ్చు. బాగ్చీ సుప్రీం జడ్జిగా ఆరేళ్లపాటు కొనసాగనున్నారు.

సంబంధిత పోస్ట్