AP: గుంటూరులో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పెళ్లిచేసుకొని ఆరు నెలలు గడవకముందే తన కుమార్తెను భర్త వేధించి చంపేశాడని వరంగల్‌కు చెందిన జగదీశ్వరాచారి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె ప్రాణాలు బలితీసుకున్న సాయికుమార్ ను కఠినంగా శిక్షించాలని గుంటూరులోని నిందితుడి ఇంటి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. గుంటూరుకు చెందిన సాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ కుమార్తె గీతిక పరిచయం కాగా.. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చారు.