ప్రముఖ ఒడియా కవి రమాకాంత రథ్‌ మృతి

50చూసినవారు
ప్రముఖ ఒడియా కవి రమాకాంత రథ్‌ మృతి
ప్రముఖ ఒడియా కవి, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రమాకాంత రథ్‌ (90) మరణించారు. భువనేశ్వర్‌లోని ఖర్వెల్‌ నగర్‌ ప్రాంతంలోని తన నివాసంలో మృతిచెందినట్లు ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రథ్‌ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. రథ్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో రథ్‌ అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్