80 విగ్రహాలకు లడ్డు, నగదు విరాళంగా అందజేత
వరికుంటపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వినాయకుని ఉత్సవాలలో భాగంగా ఉచితంగా లడ్డు, రూ.5వేలు నగదును విగ్రహ కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు. దాదాపు మండలంలో 80కి పైగా విగ్రహాలకు నగదు, లడ్డూ అందించారు. ఈ సందర్భంగా దాత యర్రా చిన బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రతి వినాయకుని ఉత్సవాలకు తాను ఏదో ఒక ఉచిత కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు.