నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పరిధిలోని పామూరు పల్లి లో వెలసి ఉన్న శ్రీ సుబ్బరాయుడు స్వామి ఆలయంలో ఆదివారం కావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పుట్టకు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు.