వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో హైస్కూల్ నుండి మంగళవారం స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరి గ్రామంలో దేశభక్తి నినాదాలతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాలకొండయ్య, స్కూల్ చైర్మన్ ఆదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి, సెక్రెటరీ కోనేపల్లి అరుణ రెడ్డి, బీజేపీ నాయకులు సందిరెడ్డి మాలకొండయ్య, శివకుమార్ పాల్గొన్నారు.