వింజమూరు చెరువు వద్ద పల్టీ కొట్టిన కారు
నెల్లూరు జిల్లా వింజమూరు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి ఏఎస్ పేటకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి వింజమూరు చెరువులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు.