వింజమూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మొక్కజొన్న వినాయకుడు
నెల్లూరు జిల్లా, వింజమూరులో మొక్కజొన్నలతో ఏర్పాటుచేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వినాయక విగ్రహాన్ని పూర్తిగా మొక్కజొన్నలతో తయారు చేశారు. మొక్కజొన్నల వినాయకుడుని దర్శించుకోవడానికి చుట్టుపక్కల నుంచి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.