ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్తూ పెన్షన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నుంచి అర్హులైన వారికి మాత్రమే కొత్త పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. అనర్హులను పెన్షన్ నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.