పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందించడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఒకే పీఎఫ్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే యూఏఎన్ ద్వారా నగదు విత్ డ్రా సేలను కూడా సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ యాక్టివ్‌లో ఉన్న పీఎఫ్ ఖాతాలను యాక్టివ్ చేయడానికి గడువు విధించింది. ఈ గడువును తాజాగా ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోకపోతే ఈపీఎఫ్‌లో కొన్ని సేవలు వర్తించవని పేర్కొంది.