ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా సోదరుడు గ్యాలో తొండప్(97) కన్నుమూశారు. ఆయన వయసు మీదపడటంతో వచ్చే అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఆయన 1927లో టిబెట్‌లోని అమ్డో ప్రాంతంలో జన్మించారు. టిబెట్ సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం గ్యాలో చైనాతో పాటు, ఇతర దేశాలతో పలుమార్లు చర్చలు జరిపారు. దలైలామా భారత్‌కు పారిపోయి వచ్చిన సమయంలో గ్యాలోనే మన దేశంతో సంబంధాలు కొనసాగించారు.