మున్సిపల్ శాఖలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఆ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సర్వర్లను అనుసంధానం చేసి, నూతన విధానాన్ని డిసెంబర్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ సిస్టంపై అధ్యయనం చేసి, నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.