AP: వైసీపీలో పైర్ బ్రాండ్ కొడాలి నానికి కొత్త ఏడాది 2025 బొత్తిగా కలిసి రాదా అన్న చర్చ సాగుతోంది. ఈ ఏడాదిలో ఆయన అరెస్ట్ తప్పదని వార్తలు వస్తున్నాయి. కొడాలి నానిని అరెస్ట్ చేసి తీరాలని టీడీపీ తమ్ముళ్లు ఎప్పటి నుంచో రగులుతున్నారు. పట్టుబడిన నాని అనుచరుల ద్వారానే మ్యాటర్‌ని లాగి.. కొడాలి నాని అరెస్ట్ పర్వానికి తెర తీస్తారని రాజకీయ నిపుణులు అంటున్నారు.