AP: అంతరించిపోతున్న, అరుదైన ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను తరలిస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.64 కిలోల మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.