AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నేడు జరిగిన భేటీలో కీలక అంశాలకు ఆమోదం లభించింది. మరికొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. దీంతో వీటిపైనే ఆరోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.