ఇంటర్మీడియట్‌లో కొత్త సిలబస్?

81చూసినవారు
ఇంటర్మీడియట్‌లో కొత్త సిలబస్?
ఇంటర్మీడియట్‌లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఏపీ ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి సిలబస్‌ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం చేయనున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. దసరా సెలవుల తర్వాత కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కాగా, విద్యా బోధనలో మార్పుపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్