లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి మంగళవారం రాత్రే ఆయన పుత్తూరు శివార్లలోని నివాసానికి చేరుకున్నారని తెలిసింది. కుటుంబీకులతో కలసి ఉంటున్న ఆయన గన్‌మెన్, పీఏ సహా బంధుమిత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఇంటికి అనుమతించడం లేదని సమాచారం.